పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుటుంబానికి దివంగత నటుడు రిషి కపూర్ భార్య నీతూ కపూర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ముఖేష్ అంబానీ దంపతులతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అంబానీ కుటుంబం తమకందించిన సహాయాన్ని గుర్తుచేసుకుంటూ నీతూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే రెండేళ్లుగా లుకేమియాతో పోరాడుతున్న రిషి కపూర్‌కు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘‘గత రెండేళ్లు మాకు, కుటుంబానికి చాలా పెద్ద జర్నీ. ఎన్నో మధుర క్షణాలు, కొన్ని కష్టతరమైన రోజులు కూడా ఉన్నాయి. ఇది భావోద్వేగంతో కూడుకొని ఉన్న సమయం. కష్ట సమయంలో అంబానీ కుటుంబం చూపించిన అమితమైన ప్రేమ వెలకట్టలేనిది. మమ్మల్ని అనేక విధాలుగా జాగ్రత్తగా చూసుకున్నారు. అంబానీ కుటుంబం నుంచి ఎంతో మద్దతు లభించింది. కష్ట కాలంలో ఆ కుటుంబం మాకెంతో సహకరించింది. (మీరందరూ సూపర్ హీరోలే: అనిల్ కపూర్)
అంబానీ కుటుంబానికి కృతజ్ఞతలు: నీతూ కపూర్