కరోనా ఎఫెక్ట్‌: నాకొక బాయ్‌ఫ్రెండ్‌ కావాలి

బీజింగ్‌: కరోనా వైరస్‌ ప్రస్తుతం చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో అయితే డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తూ సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. చైనాలో కరోనా బాధితులకు సేవలు చేస్తున్న తియాన్‌ ఫాంగ్‌ ఫాంగ్‌ అనే నర్సు ఓ కోరిక కోరింది. తనకు ఓ భాయ్‌ ఫ్రెండ్‌ను చూసి పెట్టమని ఏకంగా అక్కడి ప్రభుత్వానికే విజ్ఞప్తి చేసింది. అంతేగాక చివర్లో తన కోరిక ఇప్పుడు కాకపోయినా కరోనా మహమ్మారి అంతమయ్యాక అయినా తీర్చాలంటూ ఓ చిన్న సడలింపు కూడా ఇచ్చింది. చదవండి: కరోనా మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావ్‌: వర్మ